మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరేళ్ల శారద బాధ్యతలు స్వీకరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌గా బుధవారం హైదరాబాద్‌ బుద్ధభవన్‌లోని కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో నేరేళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సీతక్క, ఉత్తంకుమార్‌ రెడ్డి హాజరై శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. మహిళలకు నిత్యం అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
హస్తకళల చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ గౌడ్‌
తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మెన్‌గా నాయుడు సత్యనారాయణ గౌడ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సన్నిహితుడిగా పేరున్న సత్యనారాయణ పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల పలువురు కాంగ్రెస్‌ నేతలు, అభిమానులు అభినందనలు తెలిపారు.