మైగ్రేన్‌ నివారణకు నెరివియో పరికరం

డాక్టర్‌ రెడ్డీస్‌ ఆవిష్కరణ
హైదరాబాద్‌ : దిగ్గజ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ మైగ్రేన్‌ నివారణకు నెరివియో పరికరాన్ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ థెరఫీ పరికరానికి యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యుఎస్‌ఎఫ్‌డిఎ) ఆమోదం లభించిందని గురువారం డాక్టర్‌ రెడ్డీస ఓ ప్రకటనలో వెల్లడించింది. నెరివియో అనేది మైగ్రేన్‌లను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి యుఎస్‌ ఎఫ్‌డిఎ ఆమోదించబడిన మొదటి పరికరం. ఇది 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రోగులలో తీవ్రమైన మైగ్రేన్‌ చికిత్స కోసం రూపొందించబడిందని తెలిపింది.