నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ.. ‘నెరు’

నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ.. 'నెరు'ఇటీవల వస్తున్న సినిమాలన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం వస్తున్నవే. సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమర్షియల్‌ పాయింట్‌ ఆఫ్‌లో కాకుండా, సమాజానికి అవసరమైన సబ్జెక్ట్‌తో, రావాల్సిన మార్పును కోరుతూ, మహిళల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేసిన చిత్రం ‘నెరు’ అసలు ఆ సినిమాలో ఏముందో తెలుసుకుందాం…
సమాజంలో అడుగడుగునా ఆడపిల్లల ఎదుగుదలకు లింగవివక్షత, విద్య, పనిచేసే చోట, వరకట్నం మొదలగు సమస్యల రూపంలో అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా మహిళలు మొక్కవోని ధైర్యంతో సుప్రీంకోర్టు కేంద్రంగా చంపకం దొరై రాజన్‌(1951), షాబానో కేస్‌(1985), స్టేట్‌ అఫ్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ జగ్గురామ్‌ కేస్‌ (2008), మోతీలాల్‌ వర్సెస్‌ స్టేట్‌ అఫ్‌ ఎంపి(2008), ఉత్పల్‌ . కేస్‌(2010), బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (2011), వాలంటీర్‌ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేస్‌ (2013), వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టం 498-ఎ, నిన్న మొన్న వెలువడిన బిల్కిస్‌ బానోలాంటి కేసులను సైతం ఇంటి గుమ్మాలను బద్దలుకొట్టి, ఆటంకాలను అధిగమించి విజయం సాధించారు.
కాలం మారింది
మహిళలు ఎదుర్కొంటున్న జటిలమైన సమస్యల పరిష్కారంగా అనేక తీర్పులు, చట్టాలు వెలువడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు ఏర్పాటు చేశాయి. ఇంతటి పరిణామాలు చోటుచేసుకుంటున్న పీక నొక్కి వేయబడుతున్న ఉదంతాలు ఉంటూనే ఉన్నాయి. ఈ కోణంలో దర్శకుడు జీతూ జోసెఫ్‌ ”అవమాన భారాన్ని తమలోనే దిగమింగుకుని, విధి అనుకుని మనస్సును తేలిక పరుచుకుని నిశ్శబ్దంగా ఉండిపోవాలని మీరు అంటున్నారా? కాలం మారింది సార్‌. ఈ తరం అమ్మాయిలు అలా అనుకోవటం లేదు. వాళ్లు చాలా దైర్యంగా చెప్పేస్తున్నారు. ఎవరు, ఎక్కడ, ఏం చేశారనేది. అది ఒప్పుకోకపోవడం మీ వయసు, మీ సంకుచిత మనస్తత్వమే కారణం’ అనే బలమైన మాటలతో తెరకెక్కించిన చిత్రమే ‘నెరు’.
కథలోకి వెళితే…
తన తండ్రి సాయంతో సారా అనే అమ్మాయి పన్నెండేళ్లకే రషబశ్రీజ్‌ూశీతీ aత్‌ీ (మనిషి రూపురేఖలు గీయగలిగే) ప్రావీణ్యం సంపాదిస్తుంది. ప్రమాదవశాత్తూ చూపును కోల్పోతుంది. ఒకరోజు తల్లిదండ్రులు పెండ్లికి వెళ్ళడంతో ఇంట్లో ఒక్కతే ఉన్న సారాపై లైంగిక దాడి జరుగుతుంది. దైర్యం చేసి కోర్టు వరకు వెళ్ళినా వ్యాపారవేత్త కుమారుడు కావటం వల్ల మొదట్లోనే కేసు ఓడిపోయే స్థితికి చేరుకోవటమేకాక తండ్రినే ముద్దాయిగా తేల్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేస్‌ టేకాఫ్‌ తీసుకున్న మోహన్‌ లాల్‌ (విజరు మోహన్‌గా లాయర్‌ పాత్రలో) ఎలా చేధించడానికి ప్రయత్నించాడనేది మిగతా కథ. అలా అని మోహన్‌ లాల్‌ హీరోలా రెచ్చిపోయి వాదించగానే కేస్‌ గెలిచేయలేదు. డిఫెన్స్‌ పాత్రలో నటించిన ప్రియమణి (పూర్ణిమ), తండ్రి పాత్రలో సిద్దిఖ్‌ (లాయర్‌) చివరివరకూ ఓడిపోవడానికే అవకాశాలు సష్టిస్తారు. స్టేషన్‌లో ఉన్న మెమరీ కార్డ్‌, వీడియోలు మాయం చేయిస్తారు. మోహన్‌ లాల్‌ టీమ్‌ ఎంతో రిస్క్‌ చేసి ఆధారాలు సంపాదిస్తారు. మోహన్‌ లాల్‌ కోర్టులో చెప్పిన డైలాగ్‌ ‘నేరం చేసిన వాడికి శిక్ష పడకుండా ఉంటే చూపు లేనటువంటి ఈ అమ్మాయి శక్తినంతా కూడదీసుకుని, చేతులనే కళ్ళు చేసి నేరస్తున్ని ూషబశ్రీజ్‌ూశీతీ ద్వారా ప్రపంచంముందు నిలబెట్టడానికి, తన మనోదైర్యాన్ని, పోరాటతత్త్వాన్ని అవమానపరిచినట్టవుతుంది’ లాంటి మాటలు ఆలోచించేలా చేస్తాయి. సినిమాలో ఎక్కువ భాగం కోర్టు అవరణలో, ముగ్గురు లాయర్లు సిద్దిఖ్‌, ప్రియమణి, మోహన్‌ లాల్‌ అయిన అనస్వర రాజన్‌ (సారా పాత్ర) నటన చిత్రానికి ప్లస్‌ పాయింట్‌. సాక్ష్యాధారాలతో, సెక్షన్లతో వాదప్రతివాదనలతో రసవత్తర పోటీ నడుమ తీసిన చిత్రం ఇది.
మార్పు చాలా అవసరం
సినిమా పాయింట్‌లో చివరికి న్యాయమే గెలిచిందనే అంశంపై కన్నా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పోరాడినా, న్యాయమే అన్యాయమవడానికి ఎన్ని రకాల కారణాలు చూపెట్టవచ్చో వెతికిపట్టి దర్శకుడు జీతూ జోసెఫ్‌ (దశ్యం చిత్రం ద్వారా మనకు సుపరిచితుడు) ఇతను దర్శకత్వం వహించిన మమ్మీ అండ్‌ మీ చిత్రం మలయాళ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన నిలిచింది. నెరును నిర్మించినతీరు ప్రశంసించదగ్గది. కచ్చితంగా సమాజంలో ఇంకా మార్పు రావలసిన అవసరం ఉన్న విషయంపై స్పష్టత ఇస్తూ తీసిన చిత్రం. చిత్ర యూనిట్‌ అంతా ఎవరి పరిధిలో వారు అద్భుతంగా మనసులు గెలిచారనే చెప్పాలి. ఆడపిల్లలకు స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించే గొప్పనైన చిత్రం.
– మహేష్‌ బోగిని, 8985202723
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం