
హుస్నాబాద్ మండలంలోని కుచన పల్లి గ్రామానికి చెందిన మాటూరి రవి, ఐలేని సాంబరెడ్డి ఇటీవల మృతిచెందగా మృతుల కుటుంబసభ్యులను నేస్తం సొసైటీ సభ్యులు పరామర్శించారు. మృత్తుల కుటుంబాలకు నేస్తం సోషల్ సర్వీస్ సొసైటీ మడప రాజిరెడ్డి సహకారంతో ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి మడప యాదవ రెడ్డి, సొసైటీ సభ్యులు బండి వంశీ, రంజిత్,నిమ్మకంటి కార్తీక్, నమిలికొండ శ్రవణ్, జానకి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.