నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి మంగళవారం మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్ ఘనంగా నిర్వహించారు. నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్ పాల్గొన్నారు. రాజు గౌడ్ మాట్లాడుతూ భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతికి ఆదర్శప్రాయుడని అన్నారు.అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు.నేతాజీ యువజన సంఘం సీనియర్ సభ్యులు అత్తాపురం భూపాల్ రెడ్డి,మునుకుంట్ల నరసింహ గౌడ్,మల్కాజ్గిరి బాబు, బుర్ర ముత్యాలు గౌడ్, బొంతల రఘుపతి నేతాజీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ముదిగొండ మహేష్,గోపనబోయిన నగేష్, పిల్లి ఎర్రయ్య, ఈడుదల ఇంద్రసేన, మల్కాజ్గిరి గిరివర్ధన్, గుండ్ల అశోక్, నెల్లికంటి హరిప్రసాద్ బాబు, కేశవ్, అనిల్, శ్రీకాంత్, మధుసూదన్, శివకుమార్, శంకర్, దిలీప్, లింగస్వామి, విజయ్ కుమార్, సాయి నేత, శ్రీకాంత్, శివకృష్ణ తదితర యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు