
ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకులు ,బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు,స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను తుంగతుర్తి మండల కేంద్రంలో సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో వర్తక వ్యాపారులు ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు,సేవలు మరువలేనివని కొనియాడారు. నేతాజీ తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని,నేతాజీ జీవితమంతా అజ్ఞాతవాసం లాంటిదేనని, ఎక్కువ భాగం ప్రవాసంలో గడిపారని అన్నారు. నేటి యువత నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు శ్రీనివాస్ సంజీవ సతీష్ నవీన్ కుమార్ మధు శశిధర్ గణేష్ సందీప్ ఆనంద్ అచ్చయ్య జయన్న తదితరులు పాల్గోన్నారు.