నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలోని వందేమాతరం ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా అనగా జనవరి 23 నుండి 25 వ వరకు వార్షిక క్రీడా సమావేశం నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ టి.ఎం. విక్రాంత్ తెలిపారు.ఈ ముగింపు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిచ్ పల్లి మండల విద్యాశాఖాధికారిఈ.ఎల్.ఎన్. శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ టి.ఎం. విక్రాంత్ తో కలిసి ఈ క్రీడా సమావేశాన్ని దీప ప్రజ్వళనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని, అవి వారి మనోవికాసానికి దోహదపడతాయని వివరించారు.ప్రతి క్రీడా కారుడు మనస్సు తో పాల్గొని తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మన్ననలను పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఈ మూడు రోజుల క్రీడా కార్యక్రమంలో పాఠశాల పి.ఈ.టి. లతో పాటు ఉపాధ్యాయ బృందం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ క్రీడలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వందేమాతరం ఉన్నత పాఠశాల చదువులతో పాటు క్రీడల్లో కూడా తమ విజయభేరినీ మోగిస్తుందని ప్రిన్సిపాల్ విక్రాంత్. పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులను ప్రధానం చేశారు.