సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌

New action thrillerవిక్రమ్‌ నటిస్తున్న యాక్షన్‌-ప్యాక్డ్‌ చిత్రం ‘వీర ధీర సూరన్‌ పార్ట్‌ 2′. స్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్‌, ఎస్‌.జె.సూర్య, సూరజ్‌ వెంజరాముడు, దుషార విజయన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి తేని ఈశ్వర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె.ప్రసన్న ఎడిటింగ్‌ వర్క్‌ పర్యవేక్షిస్తుండగా, సి.ఎస్‌. బాలచందర్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ రియా శిబు నిర్మిస్తున్నారు.’ఇదొక సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ సినిమా ప్రేక్షకులకు సీట్‌ ఎడ్జ్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని కచ్చితంగా చెప్పగలం. సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా గ్లింప్స్‌, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇవన్నీ మిలియన్ల వ్యూస్‌ మైలురాయిని చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 27న తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. తెలుగులో ఎన్విఆర్‌ సినిమాస్‌ ద్వారా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది’ అని మేకర్స్‌ తెలిపారు.