హెచ్‌పి నుంచి కొత్త ఎఐ ల్యాప్‌టాప్‌లు

హెచ్‌పి నుంచి కొత్త ఎఐ ల్యాప్‌టాప్‌లుహైదరాబాద్‌ : ప్రముఖ కంప్యూటర్ల తయారీదారు హెచ్‌పి కొత్తగా కృత్రిమ మేథా (ఎఐ)తో కూడిన ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. శనివారం హైదరాబాద్‌లో ఒమెన్‌ ట్రాన్సెండ్‌14, హెచ్‌పి ఎన్వీ ఎక్స్‌360 14 మోడళ్లను హెచ్‌పి ఇండియా కన్సూమర్‌ అండ్‌ గేమింగ్‌ పిసి హెడ్‌ గణేష్‌ టి ఆవిష్కరించారు. వీటి ధరలను వరుసగా రూ.1,74,999, రూ.99,999గా నిర్ణయించామన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ల్యాప్‌టాప్‌లు మరింత వేగంగా, సమర్థంగా పనిచేయడానికి వాటిలో ఎఐ ఫీచర్లను జోడించామన్నారు. హెచ్‌పి ఎన్‌పియు ఫీచర్‌తో ఇవి వేగంగా, సమర్థంగా పనిచేస్తూ వినియోగదారుల అవసరాలను తీరుస్తాయన్నారు. ఒమెన్‌ ట్రాన్సెండ్‌14 విండోస్‌ 11 హోం ఆపరేటింగ్‌ సిస్టమ్‌, ఇంటెల్‌ కోర్‌ ఆల్ట్రా 9 ప్రాసెసర్‌, 14 అంగుళాల డిస్‌ప్లే, 11.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌, ఎన్‌వీడియా జిఇఫోర్స్‌ ఆర్‌టిఎక్స్‌ 4060 గ్రాఫిక్‌కార్డుతో లభిస్తుందన్నారు. హెచ్‌పి ఎన్వీఎక్స్‌ 360 14 4జిబి గ్రాఫిక్‌ మెమరీ కెపాసిటీ, ఇంటెల్‌ 7 ప్రాసెసర్‌, 1టిబి ఎస్‌ఎస్‌డి, 16 జిబి ర్యామ్‌తో అందుబాటులోకి తెచ్చామన్నారు.