గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం కోహెడ మండల అధ్యక్షునిగా గర్రెపల్లి రవీందర్ గౌడ్ నియమిస్తూ జిల్లా అధ్యక్షులు గర్రెపల్లిసాయితేజ గౌడ్ నియామక పత్రం అందించారు. ఈ సందర్బంగా గర్రపల్లి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ కుల హక్కుల సాధనలో భాగంగా జరిగే ఏ పోరాటమైన అందులో ముందుంటానన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యువజన అద్యక్షులు గణగోని శ్రవణ్, అంజి గౌడ్, నంగునూర్ మండలం సాయి గౌడ్, చిన్నకోడూరు మండలం రాజేశ్ గౌడ్, తధితరులు పాల్గొన్నారు.