వాసవి నిత్య అన్నదాన సత్రం నూతన భవనము 21న ప్రారంభం

నవతెలంగాణ  – భువనగిరి
భువనగిరి మండలంలోని సురేంద్రపురి లో యాదగిరిగుట్ట సమీపంలో వాసవి నిత్య అన్నదాన సత్రము వృద్ధాశ్రమము ట్రస్ట్ నూతన భవన ఈనెల 21న ఆదివారం  త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ సమి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు అయితరాములు ప్రధాన కార్యదర్శి ఇరుకుల రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అత్యాధునిక సౌకర్యాలతో 100 గదులు, ఏసీ రూములు, డార్మెటరీ, నిత్య అన్నదాన డైనింగ్ హాల్, 300 మంది కూర్చునే మీటింగ్ హాల్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. నిత్యాన్న సత్రానికి గౌరవ అధ్యక్షులుగా కుంద ప్రతిభ వ్యవహరించనున్నారు. యాదాద్రి, సురేంద్రపురికి వచ్చే భక్తులకు ఈ భవనం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు మంచాల ప్రభాకర్ పాల్గొన్నారు.