– సర్పంచ్‌లు జయమ్మ వెంకటయ్య, నాగమణి లింగంగౌడ్
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని గట్టుఇప్పలపల్లి గ్రామానికి నూతన బస్సు బుధవారం ప్రారంభించినట్టు సర్పంచ్‌లు జయమ్మ వెంకటయ్య, నాగమణి లింగంగౌడ్ తెలిపారు. ఈ బస్సు వేెళలు సాయంత్రం ఆమనగల్లు నుంచి 4.40 చింతలపల్లి, ఖానాపూర్, వెంకట్రావుపేట్, గట్టుఇప్పలపల్లి, వీరన్నపల్లి వెళ్లుతుందనీ, తిరిగి 5.30 వరకు అదే రూట్ గుండా ఆమనగల్లు పోతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. మహేశ్వరం డిపో మేనేజర్ మోహన్‌రెడ్డి, సీఐ అంజమ్మ, వెల్పర్ కమిటీ సభ్యులు కిషోర్, ప్రమీల, షెడ్యూల్ ఏడీసీ కాజా పాషా, ఉద్యోగ సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టుఇప్పలపల్లి సర్పంచ్ జోలం జయమ్మ వెంకటయ్య, వీరన్నపల్లి సర్పంచ్ నాగమణి లింగంగౌడ్, సింగల్ విండో డైరెక్టర్ కోళ్ల శిరీష, కృష్ణయ్య, పాండు, మచ్ఛేందర్, చంద్రయ్య, కొండల్, మహమ్మద్, కొమరయ్య, తిరుపతయ్య, రాజు, నిరంజన్ ,సెట్ వెంకటయ్య, జంగోజి, బాలయ్య, రాజు, జగదీష్ సెట్ తదితరులు పాల్గొన్నారు.