– సరికొత్త ఆరంభం
– శ్రీలంకతో భా రత్ తొలి టీ20 నేడు
– రాత్రి 7 గంటల నుంచి
– సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష్య ప్రసారం
పల్లెకెలె: టీ20 ప్రపంచ చాంపియన్ భారత్ కొత్త కోచ్, కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్ధమైంది. గురువు గౌతమ్ గంభీర్, నయా నాయకుడు సూర్యకుమార ఆధ్వర్యంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో పోటీ పడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత జట్టు శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా తన పదవీ బాధ్యతలను ముగించగా.. అతని స్థానంలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కోచ్‌గా పగ్గాలు చేపట్టాడు. వచ్చీరావడంతో జట్టులో మార్పులు మొదలు పెట్టాడు. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్‌కు కెప్టెన్సీ అప్పగించాడు. ఈ నేపథ్యంలో కోచ్‌గా గంభీర్, కెప్టెన్ గా సూర్యకుమార్ తొలి సిరీస్‌తోనే తమ మార్కు చూపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టీ20 ప్రపంచ కప్ నెగ్గిన జోరును జట్టును తమదైన శైలిలో నడిపించాలని భావిస్తున్నారు. 2026లో భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇచ్చే 2026 టీ20 ప్రపంచ కప్‌పై ఇప్పటి నుంచే ఇరువురు దష్టి పెట్టారు. ఈ మెగా టోర్నీ నాటికి బలమైన జట్టును తయారు చేయాలని అటు బీసీసీఐ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు టీ20ల నుంచి తప్పుకోవడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్ ఆతతగా ఉన్నారు. ఈ సిరీస్‌లో సత్తా చాటి జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. కెప్టెన్సీ ఆశించి భంగపడ్డ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌లో ఎలా ఆడుతాడన్నది ఆసక్తిగా మారింది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో ఇవ్వడంతో ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు మహ్మద్ సిరాజ్ ఈ విభాగాన్ని నడిపించనున్నారు.
మరోవైపు టీ20 ప్రపంచ కప్‌లో ఆడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన శ్రీలంక కొత్త కెప్టెన్ చరిత్ అసలంక నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. ప్రపంచ కప్‌లో నిరాశ తర్వాత కెప్టెన్ హసరంగతో పాటు కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్, కన్సల్టెంట్ కోచ్ జయవర్దనే రాజీనామా చేశారు. దాంతో అసలంకకు టీ20 పగ్గాలు అందించగా.. దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్య ఈ సిరీస్‌లో లంకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కొత్త కెప్టెన్ నాయకత్వంలో సొంతగడ్డపై ఈ సిరీస్‌లో సత్తా చాటాలని లంక కోరుకుంటోంది. అయితే, ఇద్దరు సీనియర్ పేసర్లు దుష్మంత చమీర, నువాన్ తుషార గాయాలతో దూరం అవడంతో సిరీస్‌కు ముందే ఆతిథ్య జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. మరి, ప్రపంచ కప్ నెగ్గి సమరోత్సాహంతో ఉన్న భారత జట్టును శ్రీలంక ఏమేరకు నిలువరిస్తుందన్నది ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా)
భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోరు, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిశాంక, కుశాల్ మెండిస్ (కీపర్), దినేశ్ చందిమల్, వానిందు హసరంగ, దాసున్ షనక, మతీష పతిరణ, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, బినుర ఫెర్నాండో