సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌

New crime thrillerసహస్ర ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై నిశాం త్‌, ఎంఎన్‌ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హైడ్‌ న్‌ సిక్‌’ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయింది. హీరో శివాజీ చేతుల మీదుగా ఈ మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ,’ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకి మరో ఫెంటాస్టిక్‌ డైరెక్టర్‌ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్ముతున్నాను’ అని తెలిపారు. దర్శకుడు బసిరెడ్డి రానా మాట్లాడుతూ, ‘ ఈ చిత్రం నుంచి ఎలాంటి కంటెంట్‌ వచ్చిన అది కచ్చితంగా బ్లాస్ట్‌ అయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చక్కగా ప్లాన్‌ చేసుకున్నాం. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని అన్నారు. ‘ఈ సినిమాని చూశాను. ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ని ఇలా కూడా చెప్పొచ్చా అనే ఎగ్జైట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని ప్రజెంట్‌ చేస్తున్నాను’ అని డైరెక్టర్‌ నవీన్‌ మేడారం చెప్పారు. హీరోయిన్‌ శిల్ప మంజునాథ్‌ మాట్లాడుతూ,’ ఇందులో పోలీస్‌ క్యారెక్టర్‌లో నటించాను. నా రోల్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నా పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా ఖచ్చితంగా అందరిని ఆకర్షిస్తుంది’ అని హీరో విశ్వంత్‌ అన్నారు.