– వాటి చుట్టూ ఉన్న ”అపోహలను” తొలగించాలి
– యూనివర్సిటీలు,ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను ప్రచారం చేయాలని, వాటి చుట్టూ ఉన్న ”అపోహలను” తొలగించాలని దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థ (హెచ్‌ఈఐ)లను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించింది. కొత్త చట్టాలు వ్యక్తి స్వేచ్ఛను ”బెదిరించేవి”, ”పోలీసు రాజ్యం” స్థాపన లక్ష్యంగా ఉన్నాయని, దేశద్రోహ నిబంధనల కింద అలాగే ఉన్నాయని, ఈ చట్టం ”పోలీసు చిత్రహింసలకు” వీలు కల్పిస్తుందని ఉన్న అపోహలను విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు పోగొట్టి, అవి మంచి చట్టాలని ప్రచారం చేయాలని ఆదేశించింది. యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి మాట్లాడుతూ, ”భారతీయ న్యాయ సంహిత- 2023 గురించి ప్రచారం చేయాలని, స్టాండీలతో ప్రదర్శనలు, ఫ్లైయర్‌లను పంపిణీ చేయాలి. న్యాయవాదులచే సెమినార్‌లు, చర్చలు నిర్వహించడంతో ప్రచారం చేయాలని ఉన్నత విద్యా సంస్థలను అభ్యర్థించాం” అని తెలిపారు. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖకు పంపడం కోసం ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించిన కార్యకలాపాల వివరాలను పంచుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోరినట్లు ఆయన తెలిపారు.భారతీయ సాక్ష్యా సంహిత (బిఎస్‌ఎస్)-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్)-2023, భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)-2023 శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర తరువాత అవి చట్టాలుగా రూపొందాయి. ఆ చట్టాలను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఎ)-1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి)-1973, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)ల స్థానంలో తీసుకొచ్చారు.”కొత్త క్రిమినల్ చట్టాలు వ్యక్తి స్వేచ్ఛను బెదిరిస్తాయి. పోలీసు రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయిబీ అవిఇప్పటికే ఉన్న క్రూరమైన నిబంధనలను తిరిగి ప్యాకేజింగ్ చేయడంలో భాగమే. కస్టడీని 15 నుండి 90 రోజులకు పొడిగించడం కొత్త క్రిమినల్ చట్టాలలో పోలీసు చిత్రహింసలకు అవకాశం కల్పించే ఒక దిగ్భ్రాంతికరమైన నిబంధన ఉంది. దేశద్రోహం పోయింది, కానీ భారతీయ న్యాయ సంహిత-2023లో ‘దేశద్రోV్‌ా’గా కనిపిస్తుంది. భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) 2023 కింద హిట్-అండ్-రన్ కేసుల్లో కఠినమైన శిక్ష విధించబడుతుంది” వంటి వాటిని మంచిగా ప్రచారం చేయాలి.”బిఎన్‌ఎస్ లో 20 కొత్త నేరాలు చేర్చగా, ఐపిసిలో ఉన్న 19 నిబంధనలు తొలగించబడ్డాయి.