నూతన క్రిమినల్ చట్టాలు నేర రహిత సమాజనికి నాంది కావాలి 

– న్యాయవాది జే. కిరణ్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
భారతీయ నూతన క్రిమినల్ చట్టాలు నేర రహిత సమాజనీకి నాందికావాలని న్యాయవాది జే కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భారతీయ న్యాయ సంహిత లో గల సెక్షన్లపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిరణ్ కుమార్ మాట్లాడారు  ప్రతి ఒక్క ఆడపిల్ల సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ నేరాలు, సామాజిక నేరాల పట్ల  అవగాహన కల్గి వుండాలని, ఏమైనా కఠిన పరిస్థితులు ఎదురైతే మహిళలు 181 మహిళా హెల్ప్ లైన్ ను, పిల్లలు 1098 చైల్డ్ హెల్ప్ లైన్  సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత లో వున్న సెక్షన్లు పరంగా కఠిన మైన శిక్షలు అందుబాటులోకి కి వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సర్వ శిక్ష అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ భాస్కర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ వాసవి ,మండల అడ్వకేట్ బాకం సంపత్ కుమార్,  పాఠశాల ప్రిన్సిపాల్ దండబోయిన అన్నపూర్ణ , జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ లు లావణ్య, పద్మ, పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.