– రామోజీ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఈనాడు మీడియా గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజే ఎఫ్) రాష్ట్ర కమిటి సంతాపాన్ని తెలియజేసింది. అలుపెరుగని అక్షర యోధునికి ఘన నివాళులర్పించింది. ఆయన కుటుంబానికి , రామోజీ గ్రూపు సంస్థల జర్నలిస్టులు, ఉద్యోగులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. రామోజీరావు పాత్రికేయ రంగంలో చెరగని ముద్ర వేశారనీ, పత్రికా స్వేచ్ఛను, జర్నలిజం విలువలను కాపాడేందుకు విశేష కషి చేశారని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షలు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య పేర్కొన్నారు. పత్రికా రంగా న్ని కొత్త పుంతలు తొక్కించారని చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వేలాది మంది జర్నలిస్టులను తయారుచేసి తెలుగు సాహిత్య, సమాచారాభి వద్ధికి తోడ్పడ్డారని చెప్పారు. తెలుగు భాషకు, తెలుగు మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివంటూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.