
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ 2024-25 నూతన కార్యవర్గాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్. ఏలేటి రవీంద్రరెడ్డి బుధవారం ప్రామాణస్వీకారం చేయించారు. నూతనత భాద్యతలు చేపట్టిన ఐఎంఎ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డా. విక్రం రెడ్డి లు మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రభుత్వ వైద్య రంగాన్నికి ప్రజలకు వారధిగా ఉంటూ, వైద్యులకు ఈ రోజుల్లో వస్తున్న ఆధునాతనమైన వైద్యం పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా వైద్య మండలి వైస్ చైర్మన్ శ్రీనివాస్, సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ ,తెలంగాణా మెడికల్ కౌన్సిల్ సభ్యులు డా విష్ణు, ఐఎంఎ అధ్యక్షులు దామోదర్ రావు, శ్రీశైలం, డా బొద్దుల రాజేంద్ర ప్రసాద్, సీనియర్ వైద్యలు డా. శ్రీహరి, రామ్ మొహన్ రావు, సుభాష్, వినోద్, కుమార్ గుప్తా, డి ఎల్ ఎన్ స్వామి, సాంబశివ రావు, తానా అధ్యక్షులు శివ ప్రసాద్, ప్రెసిడెంటు ఎలెక్ట్ ఆకుల విశాల్, ప్రధాన కార్యదర్శి విక్రం రెడ్డి, హరీశ్ స్వామీ, శ్రీధర్ రావ్, అర్చన, గ్రీశ్మా, రాజేందర్ సూరినీడు, కార్యవర్గ సభ్యులు రాజేష్, రషీద్ అలీ, ఫరీద బేగం, డా. నాగర్జున, డా. మురళి కృష్ణా, గోవింద్, డా. సిర్ప కృష్ణ, వేణు గోపాల్, దీపక్ రాథోడ్, రవితేజ తో పాటు దాదాపు 120 పైగా వైద్యులు పాల్గొన్నారు.