– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు
– అనవసరంగా సోషల్ మీడియా జోలికెళ్లొద్దు :సైకియాట్రిస్ట్, స్టూడెంట్ కౌన్సెలర్ అమ్మాజి
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో ప్రతి గంటకి ఒక మహిళ, విద్యార్థినిపై దాడులు జరుగుతున్నాయని, మహిళల రక్షణకు కొత్త చట్టాలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు. మంగళవారం నారాయణగూడలోని జాహ్నవి కాలేజ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ జరిగింది. ప్రముఖ సైకియాట్రిస్ట్, స్టూడెంట్ కౌన్సెలర్ అమ్మాజి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత హాజరయ్యారు. ఈ సందర్భంగా టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించేలా కొత్త చట్టాలను రూపొందించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహిళల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. ప్రతి మహిళా మరో సావిత్రిబాయిలా, పూలేలా కావాలని కోరారు. అణచివేయబడుతున్న ప్రతి మహిళా అగ్నిజ్వాలై మండాలని, విద్యారంగంతోపాటు రాజకీయాల్లోనూ మహిళలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
స్టూడెంట్ కౌన్సెలర్ అమ్మాజి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో హార్మోన్ల లోపంతో 12, 13 ఏండ్ల వయసులోనే పెడదోవ పడుతున్నారని, దానికి కారణం సోషల్ మీడియా ఇంపాక్ట్ అని తెలిపారు. యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, సినిమాల్లో అశ్లీల చిత్రాల వల్లనే అలా అవుతున్నారన్నారు. అనవసరమైన వాటికోసం సోషల్ మీడియా జోలికి పోవద్దని సూచించారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత మాట్లాడుతూ.. దేశంలో మహిళలు అభివృద్ధిలో వెనుకబడటానికి కారణం మనస్మృతి అని, దాన్ని అనుసరిస్తున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. స్త్రీని సమాజంలో రెండో తరగతికి చెందిన మనుషుల్లాగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతిని చదువుల తల్లిగా కీర్తిస్తున్నా.. ఆడపిల్ల చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సహకరించరని అన్నారు. ఆధునిక సమాజంలో ఉన్న మహిళలు, అమ్మాయిలు దేశ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రగతిశీల ఆలోచనలతో అన్ని రంగాలలో తమ స్థానాన్ని దక్కించుకునేలా మహిళా హక్కులు పరిరక్షణకు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, అశోక్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీ అమ్మాయిల అభ్యున్నతి కోసం పాటుపడాలని, ప్రతి అమ్మాయి సమస్య.. తన సమస్యగా భావించి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు స్టాలిన్, శ్రీమన్, సహాయ కార్యదర్శి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
13 మందితో గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ ఎన్నిక
జీఎస్‌సీసీ హైదరాబాద్ జిల్లా గర్ల్స్ కన్వీనింగ్ నూతన కమిటీని 13 మందితో ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా రమ్య, కో-కన్వీనర్లుగా పవిత్ర, జువేర, చరణ్‌శ్రీ, సంధ్య, భావన, కమిటీ సభ్యులుగా కవిత, సుష్మ, సహన, సిద్దిక, చంద్రకళ, గాయత్రి, రాధిక, భవ్యను ఎన్నుకున్నారు.వచ్చేనెల 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అరుణకుమారి తెలిపారు. వాటి సమర్పణకు తుది గడువు మే పదో వరకు ఉందని పేర్కొన్నారు. జూన్ ఆరు నుంచి తొమ్మిదో తేదీ వరకు పీజీఈసెట్ రాతపరీక్షలను నిర్వహిస్తామని వివరించారు.