నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారా యణ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు రమణ దంపతుల కూతురు నవ జీవన ప్రియ (దొంతు ప్రియాంక) ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీకి తన శరీరాన్ని దానం చేస్తూ ఆగ్రిమెంట్ పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పిన సామాజిక బాధ్యత, అభ్యుదయ భావాలు, ఆదర్శాల స్ఫూర్తితో జీవించి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలని తన శరీరాన్ని దానం చేయడానికి ఒప్పుకున్నట్టు తెలిపారు చనిపోయిన తర్వాత మన శరీరం నిరూపయోగంగా మట్టిలో కలిసిపోవడం కంటే వైద్య పరిశోధనలకు ఉపయోగపడటంతో పాటు భవిష్యత్తు తరాలకు మేలు చేస్తుందన్నారు. 27 ఏండ్ల వయస్సులోనే ఉన్నతంగా ఆలోచించి శరీరాన్ని దానం చేసిన ప్రియను మమత మెడికల్ కాలేజీ డాక్టర్లు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె వెంట ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు గుడిమెట్ల రజిత, డాక్టర్ ఉదరు, డాక్టర్ కల్పన ఎడ్వర్ ఉన్నారు.