సరికొత్త ప్రేమకథ ‘దిల్‌ రూబా’

Brand new love story 'Dil Ruba'హీరో కిరణ్‌ అబ్బవరం కొత్త చిత్రానికి ‘దిల్‌ రూబా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని శివమ్‌ సెల్యులాయిడ్స్‌, మ్యూజిక్‌ లేబుల్‌ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటు వంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్‌, రాకేష్‌ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్‌ దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ పోస్టర్‌లో కిరణ్‌ అబ్బవరం యూనిక్‌ స్టైల్‌, యాటిట్యూడ్‌తో కనిపిస్తున్నారు. ‘హిస్‌ లవ్‌, హిస్‌ యాంగర్‌..’ అనే కొటేషన్‌ కిరణ్‌ అబ్బవరం క్యారెక్టర్‌ను రిఫ్లెక్ట్‌ చేస్తోంది. లవ్‌, రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి ఎడిటర్‌ – ప్రవీణ్‌.కేఎల్‌, సినిమాటోగ్రఫీ – డానియేల్‌ విశ్వాస్‌, మ్యూజిక్‌ – సామ్‌ సీఎస్‌, రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్‌