హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుంచి కొత్త వైద్య బీమా

New medical insurance from HDFC Ergoముంబయి: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ చౌక ధరలో ‘ఆప్టిమా హెల్త్‌ ఇన్సూరెన్స్‌’ ప్లాన్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది రూ.5-7.5 లక్షల బేస్‌ సమ్‌ అస్యూర్డ్‌తో లభిస్తుందని ఆ సంస్థ బుధవారం తెలిపింది. ఇది దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన బీమా పాలసీగా నిలువనుందని ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ప్లాన్‌లో అవయవదానం వ్యయాలు, హోమ్‌ హాస్పిటలైజేషన్‌, రోడ్‌, ఎయిర్‌ ఎమర్జెన్సీ అంబూలెన్సీ సర్వీసెస్‌లను పొందవచ్చని ఆ కంపెనీ డైరెక్టర్‌ పార్థనిల్‌ ఘోష్‌ పేర్కొన్నారు. ఈ పాలసీపై ప్రతీ ఏడాది 10 శాతం బోనస్‌ జోడింపబడుతుందన్నారు.