నవంబర్‌లో నయా సినిమా

New movie in Novemberరామ్‌ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్న ‘మైత్రి’ సంస్థ రామ్‌ పోతినేనితో ఫస్ట్‌ ఎటెంప్ట్‌గా ఓ ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్‌ చేస్తోంది. నవీన్‌ పోలిశెట్టితో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమా డైరెక్ట్‌ చేసి, ఘన విజయం అందుకున్న దర్శకుడు మహేష్‌బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. విజయ దశమి సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. హీరోగా రామ్‌ పోతినేనికి ఇది 22వ చిత్రం. నవంబర్‌ నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని, రామ్‌ పోతినేనితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, హై ఎనర్జీతో న్యూ ఏజ్‌ స్టోరీ టెల్లింగ్‌తో ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ తెలిపారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.