ఎంపీపీ మానసను కలిసిన నూతన ఎంపీడీఓ 

నవతెలంగాణ –  హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ఎంపీడీఓగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీఓ పులుగు వేణు గోపాల్ రెడ్డి శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లకవత్ మానసను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపివో సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ జనగామ రవీందర్ రావు, రాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.