నూతన జాతీయ విద్య విధానాన్ని రద్దు చేయాలి

నవతెలంగాణ- ఆర్మూర్ 
 భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI ) మండల మహాసభ సోమవారం పట్టణంలోని CVR జూనియర్ కాలేజి లో నిర్వహించడం జరిగింది. ఈ మండల మహాసభ కు ముఖ్య అతిథిగా SFI జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం-2020 ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ యూనివర్సిటీలను నీర్వీర్యం చేసి విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడం దారుణమని అన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం అమలు అయితే విద్యార్థులకు విద్య అందనీ ద్రాక్షగా మారే అవకాశం ఉందని అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలలో పేద విద్యార్థుల కోసం రిజర్వేషన్లను అమలు చేయకుండా ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం అనేక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ విద్యా విధానం కోసం అడుగులు వేయాలని డిమాండ్ చేశారు.అదే విధంగా 5+3+3+4 విధానంతో  డ్రాప్ ఔట్స్ సంఖ్య పెంచే విధంగా ఉందని అన్నారు. కేంద్రం విద్యను తన గుప్పిట్లో తీసుకోవాలని రాష్ట్రాల  హక్కులను కలరాయడం అప్రజాస్వామ్యం అని అన్నారు.ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్, స్కావెంజర్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు.  స్కాలర్షిప్ ల ను ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను అమలు చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాన్ని  వేగవంతం చేయాలని అన్నారు. ఆర్మూరు పట్టణం లో ST గర్ల్స్ హాస్టల్ నీ నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జవహర్ సింగ్, సిద్దల నాగరాజు నూతన మండల అధ్యక్ష కార్యదర్శులు ఆర్వింద్, అభి  ఉపాధ్యక్షులు శ్రావణ, అరవింద్, సహయ కార్యదర్శులు హనుమంత రెడ్డి, మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.