
బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్ ఆదేశించారు. బోధన్ పట్టణంలో అన్ని వార్డుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మున్సిపల్ కమిషనర్ ని ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. మండల రెవిన్యూ అధికారులు ప్రతి మండలంలో తహసీల్దార్ ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలనీ బోధన్ ఆర్డీవో కు ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడం జరిగినది. కావున నియోజకవర్గం ప్రజలు తమ గ్రామమలో ఏ ఇబ్బంది ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో ఫిర్యాదు చేయగలరని మనవి. నీటిపారుదల శాఖ అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులకు పరిస్థితిని సమీక్షించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో కులడానికినికి అవకాశం ఉన్న పాత భవనాలను సందర్శించి నివాసం ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని మండల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పోలీస్ అధికారులకు కూడా అప్రమతంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఎప్పటికప్పుడు అధికారులు ఎమ్మెల్యే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.