రాఠీ స్టీల్‌కు కొత్త ఆర్డర్‌

హైదరాబాద్‌: బన్సల్‌ వైర్‌ ఇండిస్టీస్‌కు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉత్పత్తులను సరఫరా చేయడానికి ఆర్డర్‌ను అందుకున్నట్లు రాఠీ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ తెలిపింది. ఈ ఆర్డర్‌ రూ.7.8 కోట్ల విలువ చేస్తుందని వైర్‌ రాడ్‌లు, బిల్లెట్‌లు, ఫ్లాట్‌లలో అగ్రగామిగా ఉన్న రాఠీ స్టీల్‌ పేర్కొంది. ఇంతక్రితం ఈ సంస్థ ఘజియాబాద్‌లోని స్టీల్‌ మెల్టింగ్‌ యూనిట్‌ను ”ది ఇండిస్టియల్‌ అండ్‌ సర్వీస్‌ సెక్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పాలసీ 2004” కింద పయనీర్‌ యూనిట్‌గా యుపి ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపింది.