హైదరాబాద్ : ప్రయివేటు రంగ జీవిత బీమా కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ‘ఐసీఐసీఐ ప్రు ప్రొటెక్ట్ ఎన్ గెయిన్’ ప్లాన్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇంది కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తూ వార్షిక ప్రీమియం కంటే 100 రెట్లు అధికంగా జీవితకాల కవరేజీని కల్పిస్తుందని పేర్కొంది. ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం నుండి రక్షణను అందిస్తుందని తెలిపింది. 45 ఏండ్లలోపు వారు ఈ పాలసీని ఎంచుకోవడానికి వైద్య పరీక్షలు అవసరం లేదని పేర్కొంది.