
– తొగుటలో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
నవతెలంగాణ – తొగుట
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తొగుటలో వ్యవసాయ మార్కెట్ లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రాజెక్టు ల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ఉత్తర తెలంగా ణకు గుండెకాయ లాంటి ప్రాజెక్టు మీద కాంగ్రెస్ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడం హేయ నీయమన్నారు. నేడు యాసంగి పంట పొలాలు ఎండిపోతున్నాయని, రాజకీయాలు పక్కన పెట్టి సాగునీళ్లు అందించి రైతులను ఆదుకునే ప్రయ త్నం చేయాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరిం చడానికే మెడిగడ్డ పర్యటన చేస్తామని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లె సీమలని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన నినాదాన్ని నేడు కేసీఆర్ నిజం చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశం లో ఎక్కడా లేని విధంగా నూతన పంచాయతీ రాజ్ చట్టంతో కేసీఆర్ వాటికి ప్రత్యేక నిధులు కేటా యించి వాటి బలోపేతం కోసం చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారా చెరువు కుంటలను అభివృద్ధి చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాగునీటి సౌకర్యం, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా పథకాల తో గ్రామాల్లో పచ్చని పంట పొలాలతో ఆరోగ్యకర మైన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు పొద్దు తిరుగుడు ధాన్యంను తొగుట వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చి మద్దతు ధర రూ.6760 పొందాలని సూచించారు. కార్యక్ర మంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కుపెడ్ డీఎం క్రాంతి, సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, తహసీల్దార్ శ్రీకాంత్, మార్కెట్ కార్యదర్శి స్వామి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కో అప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, ఎంపీటీసీలు సుతారి లలిత రమేష్, వేల్పుల స్వామి, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ సిరినేని గోవర్ధన్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమి టీ మాజీ దోమల కొమురయ్య, బక్క కనకయ్య, మాజీ వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి, దేవునూరి పోచ య్య, చిలువేరి మల్లారెడ్డి, ఎం చంద్రారెడ్డి, బోధనం కనకయ్య, మంగ నర్సింహులు, శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, భిక్షపతి, అనిల్, అశోక్, వెంకట్, సుభాష్, బాలరాజు, బైరా గౌడ్, ఎల్లం, పులి రాజు, రమేష్ గౌడ్, నర్సింహులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.