
ఉప్పునుంతల మండలంలోని లక్ష్మాపురం గ్రామం వెంకటేశ్వర్ల చెరువు కిందా ఉన్నా లక్ష్మాపురం,పెద్దాపురం, మొల్గర గ్రామాల రైతులు గత సంవత్సరం వచ్చిన విధంగానే ఈ సంవత్సరం కూడా కెఎల్ఐ నీళ్లు వాస్తవి అని ఆధారపడి చెరువు కింది గొల్ల వాగు పక్క గ్రామాల రైతులు వరి నాట్లు వేసినారు ఈసారి కెఎల్ఐ కాలువల నీరు అందక పంట చేతికి రాక ముందే సాగు నీరు బంధు కావడంతో గొల్ల వాగు ఎండిముఖంపట్టింది లక్ష్మాపుర్ చెరువులో పుష్కలంగా నీళ్లు ఉన్నందున సంబంధిత అధికారులు చొరవ తీసుకొని చెరువు కిందా ఉన్నా చెక్ డ్యాములను (కాతుపలు ) 15 రోజులకు ఒక్కసారి నింపుతే 150 నుండి 200 వందల ఏకురాల వరి పైరు కాపాడాలని రైతులు అధికారులకు విన్నవించుకుంటున్నారు. గత సంవత్సరం కూడా యాసంగి సీజన్లలో సాగు నీళ్లు కొరత ఉంటే ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుక పోయి నీళ్లు వదిలియ్యడం జరిగిందని కనుక ఇరిగేషన్ సంబంధిత అధికారులు నీళ్లు వదిలి పోట్టకొచ్చిన చేలను కాపాడవలసిందిగా ప్రజాప్రతినిధులు, అధికారులను రైతులు కోరుతున్నారు.