న్యూఢిల్లీ : గృహోపకరణాల తయారీదారు బాస్ హోమ్ అప్లయిన్సెస్ కొత్తగా సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇవి 187 లీటర్లు, 226 లీటర్ల వరకు సామర్థ్యాలను కలిగి ఉంటాయని పేర్కొంది. ఇవి 18 గంటల పాటు శీతలీకరణను అందిస్తాయని తెలిపింది. 10 ఏళ్ల కంప్రెసర్ వారంటీతో అందుబాటులోకి తెచ్చినట్లు బిఎస్‌హెచ్ గృహోపకరణాల ఎండి, సిఇఒ సైఫ్ ఖాన్ తెలిపారు. కాగా.. వీటి ధరలను ఆ సంస్థ వెల్లడించలేదు.