జెలియో ఇ బైక్స్‌ నుంచి కొత్త స్కూటర్లు

జెలియో ఇ బైక్స్‌ నుంచి కొత్త స్కూటర్లున్యూఢిల్లీ : జెలియో ఇ బైక్స్‌ కొత్తగా గ్రేస్‌ సీరిస్‌లో తక్కువ వేగం కలిగిన విద్యుత్‌ స్కూటర్లను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద వీటి ధరల శ్రేణీని రూ.59,273 నుంచి రూ.83,073గా నిర్ణయించింది. అదే విధంగా గ్రేసీఐ మోడల్‌ను ఆవిష్కరించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ సిరీస్‌లో ఐదు విభిన్న మోడళ్లు ఉన్నాయని పేర్కొంది. 150 కిలోల లోడ్‌ సామర్థ్యం కలిగి ఉన్నాయంది.