– తెలంగాణలోని పీఎంజే షోరూమ్‌ల వరుసలో మరో కొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించిన నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
నవతెలంగాణ – కంఠేశ్వర్
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెల్లరీ బ్రాండ్ అయినటువంటి పిఎంజె జ్యువెల్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పీఎంజే జ్యువెల్స్ తెలంగాణ క్లస్టర్ హెడ్ మహేశ్వరం మధన్ కుమార్, పి ఎం జె జ్యువెల్స్ నిజామాబాద్ స్టోర్ హెడ్ వడ్నాల కమల్‌లతో కలిసి ఈ కొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. ఈ ఎలైట్ షోరూమ్ పీఎంజే యొక్క నమ్మకమైన కస్టమర్లతో నిండిపోయింది. వారంతా ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. నిజామాబాద్‌లోని స్థానిక కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ స్టోర్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ముఖ్యంగా వజ్రాలు, బంగారం, విలువైన రాళ్లతో కూడిన డిజైన్ల విస్తృత ప్రదర్శన ఉంటుంది. పిఎంజె ఆధ్వర్యంలోని అత్యుత్తమ కలెక్షన్ తో పాటు ఇంతకు ముందు చూడని డిజైనర్ ఆభరణాల శ్రేణి, హాండ్ మేడ్ ఆభరణాల సృజనాత్మకతతో పాటు ప్రాంతీయ సాంస్కృతిక, వివాహ ఆభరణాల ప్రదర్శనే కాకుండా ఆఫీసు, పార్టీ వేర్, సాధారణ రోజువారీ దుస్తులకు తగిన తేలికపాటి క్రియేషన్‌లు స్టోర్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన స్టోర్ తన వినియోగదారులందరికీ ఆధునాతనంగా, అత్యుత్తమమైనn ఇంతకు ముందు ఎప్పుడూ చూడని డిజైనర్ తో అద్భుతమైన వజ్రాల పెళ్లి ఆభరణాల విస్తృత శ్రేణిని అందిస్తుందని హామీ ఇచ్చింది.ఈ ప్రారంభోత్సవం సందర్బంగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా. ఈ చిరస్మరణీయ కార్యక్రమం గురించి తన ఆలోచనలను పంచుకుంటూ నిజామాబాద్‌లోకి పి ఎం జె జ్యువెల్స్ విస్తరించడం ఆనందంగా ఉంది. అంతే కాకుండా నాణ్యత, చేతిపనుల పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయం. ఈ కొత్త స్టోర్ నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రజలకు అధ్భుతమైన ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని, ఈ ఆసక్తిని మరింత పెంచుతుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఈ సందర్బంగా మహేశ్వరం మధన్ కుమార్, వడ్నాల కమల్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పి ఎం జె జ్యువెల్స్ ప్రసిద్ధి చెందిన రిటైల్ షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగతీకరించిన ఆతిథ్యాన్ని అనుభవించడానికి మేము ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాము. నిజామాబాద్‌లోని మా పీఎంజే జ్యువెల్స్ కొత్త స్టోర్ సైతం ఇన్ని సంవత్సరాలుగా వి ఎం జె కొనసాగిస్తున్న ఘనమైన వారసత్వాన్ని ప్రతిధ్వనిస్తుంది అని అన్నారు.దక్షిణ భారతదేశంతో పాటు యు.ఎస్.ఎ అంతటా విస్తరించి ఉన్న పీఎంజే స్టోర్‌ల వృద్ధిలో ఈ నూతన చేరిక… దూకుడుగా ముందుకు సాగుతున్న ఈ బ్రాండ్ యొక్క విస్తరణ ప్రణాళికలనుప్రతిబింబిస్తుంది. పి ఎం జె జ్యువెల్స్‌లోని డిజైన్‌లు… భారతీయ స్వర్ణకారుల అద్భుతమైన నైపుణ్యం, కళాత్మకతలను ప్రతిబింబిస్తాయి. ఈ శుభ సందర్భంగా పిఎంజె సంస్థకు చెందిన విశ్వసనీయ కస్టమర్‌లు పాల్గొని ఈ వేదికలో ప్రదర్శించబడిన కొత్త డిజైన్‌లపై ఓ లుక్కేశారు.