సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం జరిగిన వేడుకలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘గుమ్మా..’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ, ”గుమ్మా..’ సాంగ్ వినగానే అందరికీ నచ్చుతుంది. ఈ పాటకు రెహ్మాన్ మంచి లిరిక్స్ ఇచ్చారు. శేఖర్ చంద్ర క్యాచీ ట్యూన్‌తో కంపోజ్ చేశారు. ఈ సినిమాలోని ఆల్బమ్ మొత్తం బాగుంటుంది. రియల్ లైఫ్‌లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నాను’ అని తెలిపారు. ‘ఫ్రెష్ సబ్జెక్ట్ ఇది. ఆడియెన్స్ ఈ మూవీ చూసి ఒక మంచి ఫీల్‌తో థియేటర్ల నుంచి బయటకు వస్తారు’ అని హీరో సుహాస్ చెప్పారు. నిర్మాత ధీరజ్ మొగలినేని మాట్లాడుతూ, ‘మూవీని జనవరి ఎండ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు.