నయా సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌

నయా సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌బి.జి. వెంచర్స్‌ పతాకంపై అజరు, రవి ప్రకాష్‌, హర్షిణి, మాండవియా సెజల్‌ నటీనటులుగా తడకల వంకర్‌ రాజేష్‌ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సస్పెన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌ ‘కేసు నెం.15′. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా చిత్ర యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత సి.కళ్యాణ్‌ ట్రైలర్‌ను విడుదల చేయగా, టి.యఫ్‌.సి.సి. ప్రెసిడెంట్‌ ప్రతాని రామకష్ణ గౌడ్‌ టీజర్‌ను, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. దర్శక, నిర్మాత తడకల వంకర్‌ రాజేష్‌ మాట్లాడుతూ,’మా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు జాన్‌ మంచి మ్యూజిక్‌ ఇస్తే, ఆనం వెంకట్‌ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరూ సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో ప్రతి సీన్‌ చూసే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయడమే కాకుండా మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని అన్నారు. ‘పోలీస్‌ క్యారెక్టర్స్‌ కాకుండా డిఫరెంట్‌ రోల్స్‌లో నటిద్దాం అనుకున్న నాకు రాజేష్‌ చెప్పిన ఈ కథ చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. ఇందులో నా పాత్ర నాలా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా బిగ్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని నటుడు రవి ప్రకాష్‌ చెప్పారు. చిత్రం శ్రీను మాట్లాడుతూ, ‘ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని అన్నారు.