కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘జ్యువెల్ థీఫ్’. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రేమ, అజరు, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘హీరోగా కృష్ణసాయి ఈ సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఇదొక ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’ అని హీరో కృష్ణ సాయి చెప్పారు. ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ, ‘కృష్ణ సాయికి తగ్గ కథ ఇది. అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. అందరిని ఆకట్టుకునే సినిమా ఇది. త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నాం’ అని తెలిపారు.