ప్రజల గొంతుకగా నవ తెలంగాణ

New Telangana as voice of people– కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్
నవతెలంగాణ – సిరిసిల్ల
ఆర్థికంగా అట్టడుగునున్న ప్రజల గొంతుకగా నవ తెలంగాణ నిలుస్తోంది నవ తెలంగాణ పత్రిక లౌకిక విలువలకు కట్టుబడి వార్తా కథనాలు రాస్తుంది. నిజాయితీ నిబద్దతతో పయనిస్తుంది ప్రతి అక్షరం ప్రజల పక్షం అన్న నినాదంతో 40 ఏళ్ల పైబడి ప్రజల గొంతుకను వినిపించిన ప్రజాశక్తి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని అను దినం జన స్వరం అంటూ  స్వరాష్ట్రంలో నవ తెలంగాణ గా బయలుదేరి, జనం గొంతుకగా నిలుస్తోంది. ఆర్థికంగా అట్టడుగునున్న ప్రజల గొంతును వినిపిస్తూ, నేడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కేవలం ప్రజలు శ్రేయోభిలాషుల మన్ననలు వారి ఆర్థిక తోడ్పడుతో నవ తెలంగాణ ప్రస్థానం సాధిస్తుంది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని సమస్త ఉద్యోగులు సిబ్బంది త్యాగాలకు వచ్చి ప్రజల గొంతును కాపాడేందుకు యజ్ఞం చేసి తనకంటూ ప్రస్తానాన్ని చాటుకుంటూ వస్తుంది నవ తెలంగాణ. ఈ నవ తెలంగాణ పత్రిక కు మరోసారి నేను వార్షిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.