నేడు నవతెలంగాణ నూతన వెబ్‌సైట్‌ ప్రారంభం..


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నవతెలంగాణ దినపత్రిక నూతన వెబ్‌సైట్‌ను గురువారం హైదరాబాద్‌లోని ఎమ్‌హెచ్‌ భవన్‌లో ప్రారంభించనున్నారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభి స్తారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సభను నిర్వహిస్తామని నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌ ఒకప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.