ఐషర్‌ నుంచి నాన్‌ స్టాప్‌ సిరీస్‌లో కొత్త ట్రక్కులు

ఐషర్‌ నుంచి నాన్‌ స్టాప్‌ సిరీస్‌లో కొత్త ట్రక్కులున్యూఢిల్లీ : విఇ కమర్షియల్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ యొక్క వ్యాపార విభాగంమైన ఐషర్‌ ట్రక్స్‌ అండ్‌ బసెస్‌ కొత్తగా నాన్‌ స్టాప్‌ సిరీస్‌లో కొత్త ట్రక్కులను విడుదల చేసింది. మెరుగైన పనితీరుతో నాలుగు కొత్త హెవీ డ్యూటీ ట్రక్కులను ఆవిష్కరించినట్లు విఇసివి ఎండి, సిఇఒ వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ నాన్‌ స్టాప్‌ సిరీస్‌ శక్తివంతమైన, ఇంధన సమర్థవంతమైన ఇంజిన్‌లను కలిగి ఉన్నాయన్నారు. వీటిలో ఐషర్‌ ప్రో 6019ఎక్స్‌పిటి , టిప్పర్‌ ఐషర్‌ ప్రో 6048ఎక్స్‌పి, హాలేజ్‌ ట్రక్‌ ఐషర్‌ ప్రో 6055ఎక్స్‌పి, ఐషర్‌ ప్రో 6055ఎక్స్‌పి 4ఞ2 మోడళ్లున్నాయని పేర్కొన్నారు.