నవతెలంగాణ – హైదరాబాద్: కరోనా విధ్వంసం మరువక ముందే చైనా సైంటిస్టులు మరో ప్రమాదకర వైరస్‌ను తయారుచేశారు. ఎబోలా వైరస్‌ను పోలిన సింథటిక్ వైరస్‌ను 10 చిట్టెలుకలకు ఇంజెక్ట్ చేశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో అవి 3 రోజుల్లోనే చనిపోయాయి. మనిషిపై ఎబోలా ప్రభావం, చికిత్స మార్గాలను కనుగొనడమే ఈ ప్రయోగం ఉద్దేశమట. కానీ పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా ఈ వైరస్‌ను ల్యాబ్ నుంచి సమాజంలోకి పంపితే? అనే ఆందోళనలు ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో నెలకొన్న అనుమానాలు.