పోచారంలోకి కొత్తనీరు..

Pocharam in Nagireddypet mandalనవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో కొత్తనీరు చేరుతుంది గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతాలలో చెక్ డ్యాములు నిండడంతో పోచారం ప్రాజెక్టులోకి ఉత్తర నీరు చేరుతున్నట్లు ఇరిగేషన్ డి ఈ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగువ ప్రాంతాలైన గాంధారి,  గుండారం  లింగంపేట్ ప్రాంతాలలో వర్షాలు భారీగా కురవడంతో ఎగువ ప్రాంతాలలో నుండి పోచారం ప్రాజెక్టులోకి కొత్తనీరు చేరుతున్నట్లు డి ఈ తెలిపారు. జీరో స్టోరేజ్ లో ఉన్న పోచారం ప్రాజెక్టు ప్రస్తుతం 6:30 అడుగులు నీరు చేరినట్లు డి ఈ  ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టు నీటిమట్టం  పెరుగుతూ ఉండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.