కామారెడ్డి జిల్లా డీఈఓను టిఎస్పిటిఏ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుబాసి నరేందర్, ప్రధాన కార్యదర్శి లింబాద్రి, గౌరవ అధ్యక్షులు అనిల్ కలిసి కామారెడ్డి జిల్లాలో ఉన్న డిప్యూటేషన్ విషయంలో చర్చించడాం జరిగిందనీ నూతన అధ్యక్షులు నరేందర్ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల బిల్లుల గురించి, స్కావెంజర్ నిధుల విడుదల విషయంలో రెండు రోజుల్లో నిధులు విడుదల అవుతాయని అందరు స్కావెంజర్ ని నియమించుకోవాలని, జి ఓ నెంబర్ 25 తో సంబంధం లేకుండా ప్రైమరీ పాఠశాలలో అవసరం ఉన్న చోట ఖచ్చితంగా ఉపాధ్యాయులను నియమించి ప్రైమరీ పాఠశాలలను పరిరక్షించాలని తెలుపడం జరింగిందన్నారు.