
నవతెలంగాణ – చండూరు
నిరుపేదల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం స్థానిక గాంధీజీ విద్యాలయంలో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. గాంధీజీ ఫౌండేషన్ వారి పదమూడవ నెల నిరుపేదలకు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ తో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని తెలిపారు.నిరుపేదల కండ్లల్లో ఆనందాన్ని చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, వెంకటేశ్వర్లు, రమేష్, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.