నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి..

May the New Year bring light to everyone's lives.– సమాచార హక్కచట్టం జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్
నవతెలంగాణ – మల్హర్ రావు
నూతన సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలనియునైటెడ్ ఫోరమ్ పర్ సమాచార హక్కుచట్టం రక్షణ వేదిక భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ ఆకాంక్షించారు.బుధవారం మండల కేంద్రంలో మాట్లాడారు కాలం అనంతమైనదని, కాలానికి అంతం లేదు, క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలుగా, మనం కాలాన్ని విభజించి లెక్కలు వేసుకొని కొత్త సంవత్సరం, వస్తుందన్నారు. గతంలో మనకు ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో తీపి గుర్తులు, కష్టసుఖాలు కలయిక జీవితం, అత్యున్నతమైన శిఖరం పక్కన అగాదమునే, లోయ ఉన్నట్లు సుఖం పక్కన కష్టాలు ఉంటాయి,కష్టాల్లో కొలిమిలో కాలినప్పుడు సుఖo విలువ తెలుస్తుందన్నారు.గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ సమీప భవిష్యత్తును దర్శిస్తూ మనం నిర్దేశించుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగడమే జీవితం, అలా రేపటి మీద ఆశతో ఆశవాహ దృక్పథంతో జీవిస్తున్న అలుపెరుగని బాటసారి లందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.