
మండలంలోని పసర గ్రామంలో నూతన సంవత్సర వేల అపశృతి చోటు చేసుకుంది. దసరా ఎస్ ఐ ఎస్.కె మస్తాన్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన వాసంపల్లి వినోద్ కుమార్ 31 సంవత్సరాలు నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బర్రెను ఢీకొన్న ఘటనలో మృతి చెందడం జరిగిందని తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నూతన సంవత్సర వేల వినోద్ కుమార్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసులోనే ఎంచుకున్న లారీలు వాటితో చేసే వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన వినోద్ తమతో గడిపిన కొద్ది క్షణాల్లోనే అనంత వాయువుల్లో కలిసిపోవడం తాము జీర్ణించుకోలేకపోతున్నామని తోటి మిత్రులు బావూరు మంటున్నారు. తమ కళ్ళ ముందు ఎంతో చలాకీగా హుషారుగా ఉండే కుర్రాడు విగత జీవిగా పడి ఉండడం పట్ల గ్రామ ప్రజలు నిట్టూర్చుతున్నారు.