దుబ్బాక ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి

Newborn baby died in Dubbaka hospital– గర్భిణీ పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
– చర్యలు తీసుకోవాలంటున్న బాధిత కుటుంబీకులు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్‌
దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం ఆడ శిశువు మరణానికి కారణమైంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. రామాయంపేట మండలం కోనాపూర్‌ గ్రామానికి చెందిన నవనీతకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శనివారం దుబ్బాక ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నర్స్‌లు తప్ప వైద్యులు ఎవరూ లేరు. చివరికి రాత్రి 11 గంటల సమయంలో నార్మల్‌ డెలివరీ చేయగా… డెలివరీ అయిన కాసేపటికి నవజాత శిశువు మరణించింది. జరిగింది. కుటుంబ సభ్యులు నిలదీయడంతో వైద్య సిబ్బంది ఏమీ చెప్పలేకపోయారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టాఫ్‌ నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహిం చారు దీనిపై దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవజాత శిశువు మరణానికి ఆస్పత్రి సిబ్బందే కారణమని నవనీత భర్త స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గంగరాజు తెలిపారు.