ప్రజలకు, ప్రభుత్వానికి వారధి వార్త పత్రికలు 

– ఎంపీడీవో తిరుపతిరెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి
ప్రజలకు, ప్రభుత్వానికి వార్త పత్రికలు వారధిగా పనిచేస్తున్నాయని, పేదల పత్రికగా నవతెలంగాణ పనిచేస్తుందని, నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ అని ఎంపీడీవో తిరుపతిరెడ్డి బుధవారం అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నవ తెలంగాణ 2025 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆవిష్కరణలో నవతెలంగాణ రికవరీ ఇంచార్జ్ భాస్కర్, విలేకరి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది మోహన్, నరేష్, శ్రీనివాస్, నవీన్, పంచాయతీ కార్యదర్శులు సాగర్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.