‘మల్లెపువ్వు, మెంటల్ కష్ణ, కలవరమాయే మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ఎం4ఎం (‘మోటివ్ ఫర్ మర్డర్’). సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మ్యూజిక్‌పై స్పెషల్ వీడియో చేశారు మోహన్ వడ్లపట్ల. వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉందన్నారు. ఇలాంటి ట్యూన్స్ ఇప్పటి వరకు చూసి ఉండరని చెప్పారు. ఈ సందర్భంగా తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మోహన్ వడ్లపట్లకు మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ఇసైపెట్టై కతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా మ్యూజిక్ లవర్స్‌కి బాగా నచ్చుతుందని అన్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలం.. ఇలా ఐదు భాషలలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఐదు భాషలలో రిలీజ్ అయిన టీజర్స్‌కు ఇసైపెటై ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం వసంత్ ఇసైపెట్టై నేతత్వంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నెక్ట్స్ లెవల్ మ్యూజిక్
11:40 pm