
రాష్ట్రంలో పిల్లలపై జరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని మహిళా సమస్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ‘సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమన సవిత అధ్యక్షతన మహిళా సమాఖ్య జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జంగమ్మ మాట్లాడారు ఈ నెల ఐదున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బెల్ట్ షాపులు గ్రామాలలో నిషేధించాలని నిరసన తెలిపారు అన్నారు ఈ నెల 7న ప్రభుత్వం నిర్ణయించిన రూపాయలు 500 కు గ్యాస్ అందించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని కోరారు. ఆధునిక సమాజంలో ఉన్నప్పటికీ మహిళలపై గ్రామాలలో పట్ట ణానికి జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలన్నారు మునుగోడు నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ దాడులు చేసి బెల్టు షాపులు నిషేధం చేస్తున్నారని అదే తరహా లో జిల్లా వ్యాప్తంగా చేయాలని కోరారు. జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. యువత విద్యార్థులు పూర్తిగా వాటికి అలవాటు పడి చదువులు దూరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి యువత ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గుర్రం రాజమణి భాగ్యమ్మ, జయలక్ష్మి, మంగమ్మ,అంజమ్మ పాల్గొన్నారు.