నవతెలంగాణ మల్హర్ రావు
నిరంతరం అవినీతిపై పోరాటం చేస్తూ అవినీతి మహ్మరిని అంతం చేయడమే ఎన్ హెచ్ ఆర్సీ ద్యేయమని భూపాలపల్లి జిల్లా మానవ హక్కుల మండలి అధ్యక్షుడు సభావాట్ నాగరాజు అన్నారు. జాతీయ ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుర్ర రమేష్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రములోని కొమురయ్య భవన్ లో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు అవినీతి, లంచం, చేతులు తడపందే ప్రభుత్వ కార్యాలయాల్లో పని అయ్యే పరిస్థితులు లేవని,అవినీతి విశ్వవ్యాప్తం అయిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ దినోత్సవాన్ని, జరుపుకుంటామన్నారు. అవినీతి తారాస్తాయికి చేరిందని,.అవినీతిని అంతం చేయదానికి ఎన్ హెచ్ ఆర్సీ పోరాటం చేస్తోందన్నారు. ప్రభుత్వ కార్యాయల్లో అవినీతి, కొంత మంది కాంట్రాక్టరులు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించక ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జరుగుతుందని ఆరోపించారు. అవినీతి లేని సమాజం నిర్మించడం మన హక్కు.అవినీతి అంతం మన పంతం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముడుతనపల్లి ప్రభాకర్, అశోక్ రెడీపీ, మల్హర్,ఘన పూర్ మండలాల అధ్యక్షులు చింతల కుమార్ యాదవ్, కూతురు రమణ, జిల్లా మీడియా ఇంచార్జి పరకాల సమ్మయ్య గౌడ్, మల్హర్ మండల ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ పాల్గొన్నారు.